పయనించే సూర్యుడు, మార్చి 10, అశ్వాపురం: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజులు) కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అశ్వాపురం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ఆధ్వర్యంలో డంపిండ్ యార్డ్ నందు పేరుకుపోయిన చెత్తను డోజర్ సహాయంతో శుభ్రం చేయించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం నందు పంచాయతీ కార్యదర్శి కందిమళ్ల శ్రీకాంత్, ఉప సర్పంచ్ తుళ్ళూరీ ప్రకాష్ రావు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
