పయనించే సూర్యుడు 10-03-2026-రాజంపేట న్యూస్ : మార్కాపురం పట్టణంలో గొల్ల సత్యనారాయణ కళ్యాణమండపంలో మదర్ థెరీసా జాతీయ సర్వీస్ గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా సి.ఎస్సి కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ పీపీపీ అంజనీ కుమారి పాల్గొని ఈ అవార్డు ను చెక్కభజన గురువు ఓబిలి వెంకటసుబ్బయ్యకు అందజేశారు. తిరుపతి జిల్లా, పెనగలూరు మండలం, నల్లపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓబిలి పుల్లయ్య, చంగమ్మ దంపతుల మొదటి కుమారుడు ఓబిలి వెంకటసుబ్బయ్య చిన్నతనం నుండి కళా రంగాలలో రాణిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ప్రాచీనమైన కళ చెక్కభజన, జడకోపు, కోలాటం, పండరి భజన రంగాలలో ఆసక్తితో కడప జిల్లా చెక్కభజన గాన కోకిల గురువు నాయన పల్లి ఓబులేసు దగ్గర 2000 సంవత్సరంలో చెక్కభజనను నేర్చుకున్నారు. 2003 నుండి చెక్కభజన గురువుగా ఎదిగి చాలా గ్రామాలలో, పట్టణ ప్రాంతాలలో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చెక్కభజన కళా రంగాలలో మంచి గుర్తింపు పొందిన గురువుగా మదర్ థెరీసా జాతీయ సర్వీస్ ఫౌండేషన్ వారు చెక్క భజన గురువు ఓబిలి వెంకటసుబ్బయ్యకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్బంగా ఓబిలి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ తనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, తన చెక్కభజన గురువు ఓబులేసు అడుగుజాడలలో నడుస్తూ ఆయన పేరు ప్రతిష్టలను కళా రంగాలలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.