సమాజ సేవలో కాంపల్లి లక్ష్మి ప్రసన్న రఘు..

పయనించే సూర్యుడు, మార్చి 10 (రామగుండం):పసిపిల్లల సంక్షేమం పట్ల మమకారం చూపుతూ కాంపల్లి లక్ష్మీప్రసన్న రఘు గ ఆదర్శంగా నిలిచారు. 22వ డివిజన్‌లోని అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న చిన్నారులు తీవ్ర వేడి తాపాన్ని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించారు.అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు చల్లని వాతావరణం కల్పించేందుకు స్వంతంగా ఒక కూలర్‌ను కొనుగోలు చేసి అందించారు. అదేవిధంగా అక్కడి చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సునీత కేంద్రంలో ఉన్న కొన్ని చిన్న చిన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందిస్తామని కాంపల్లి లక్ష్మీప్రసన్న రఘు తెలిపారు.ఈ కార్యక్రమంలో కె.ఆర్ టీం సభ్యులు సురేష్, సందీప్, ప్రవీణ్, పి.నవీన్, అరుణ్, అన్వేష్, సతీష్, శ్రీనివాస్, నవీన్, బూర్ల శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *