పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 10.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) 1)చిత్తూరు, పలమనేరు వైపు నుండి వచ్చు బారీ వాహనాలు (లారీలు, ట్రక్కులు మొదలైనవి) అన్ని పుంగనూరు పట్టణం లోనికి రాకుండా కనుములో గంగమ్మ గుడి జంక్షన్ నుండి బైపాస్ రోడ్డు ద్వారా భీమ గాని పల్లి జంక్షన్ మీదుగా మళ్లించడం జరుగుతుంది, పలమనేరు వైపు నుండి వచ్చు ఆర్ టి సిబస్ లు వాసవి కల్యాణమండపం దగ్గర నుండి న్యూ జె టౌన్ వైపు మల్లించి అక్కడి నుండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్, శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ మీదుగా పుంగనూరు టౌన్ లోకి అనుమతించబడును. 2) మదనపల్లి వైపు నుండి పలమనేరు, చిత్తూరు వైపు వెళ్ళు ఆర్ టీ సి బస్ లు శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ నుండి గోకుల్ సర్కిల్ మీదుగా మార్కెట్ యార్డ్ మీదుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ మీదుగా వెళ్ళవలెను. 3) ముల్ బా గల్l వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు మధన పల్లి మీదుగా పిచ్చిగుండ్ల పల్లి, గూడురు పల్లి దగ్గర పలమనేరు హైవే మీదుగా మళ్ళించడం జరిగింది. 4)ముల్ బా గల్ నుండి వచ్చే బస్సులను డాన్ బాస్కో స్కూల్ వరకు అనుమతించడం జరిగింది చిత్తూరు నుండి వచ్చు ఆర్ . టి సి బస్సులను ఎన్ టీఆర్ సర్కిల్ జంక్షన్ – గోకుల్ సర్కిల్ మీదుగా మదనపల్లె రోడ్డుకు మళ్ళించడం జరిగింది. మదనపల్లి నుంచి వచ్చు ఆర్ టి సి బస్సులను ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా యుఎన్ఆర్ సర్కిల్ నకు మళ్ళించడం జరిగింది రామసముద్రం నుండి వచ్చే ప్రైవేట్ బస్సులను శుభారం డిగ్రీ కళాశాలవరకు మళ్ళించడం జరిగింది పైన తెలిపిన ట్రాఫిక్ మళ్ళింపులు మార్చి10-03-2026 ఉదయం 7 గంటల నుంచి 12-03-2026 ఉదయం వరకు అమలు చేస్తారు. కావున ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను విజయంతం చేయవలసినదిగా విజ్ఞప్తి.