పయనించే సూర్యుడు మార్చి 10 కరీంనగర్ న్యూస్: పేద రెడ్డి యువత కు ఉపాధి అవకాశాలు కల్పించాలని రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించకుండా, పాలకవర్గాన్ని ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వెంటనే రెడ్డి కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు . ఈ మేరకు తిరుపతి రెడ్డి మీడియాకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. నెల రోజులలో కార్పొరేషన్ ఏర్పాటు చేయక పోతే ఎప్రిల్ నెల చివరి వారంలో కరీంనగర్ లో రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో అన్ని రెడ్డి సంఘాలను కలుపుకొని రెడ్ల రణ భేరి పేర బహిరంగ సభ నిర్వహిస్తామని, ప్రభుత్వానికి తమ శక్తి చాటి చెప్తామన్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం లోకి వచ్చిన వెంటనే రెడ్డి కార్పొరేషన్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. కానీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు నిధులు కేటాయించకుండా, పాలకవర్గాన్ని ఏర్పాటు చేయలేదని, వెంటనే పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి రూ.2000 కోట్లతో ప్రత్యేక నిధిని కేటాయించాలని ఆయన కోరారు. కార్పొరేషన్ పై ప్రభుత్వం స్పందించకపోతే కార్పొరేషన్ నిధుల సాధన లక్ష్యంగా ఏప్రిల్ మాసంలో భారీ బహిరంగ సభకు సన్నద్ధం మవుతున్నట్లు తెలిపారు .