చట్టి గ్రామపంచాయతీలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఆర్దిక ఉపాధి అవకాశాలను కల్పించండి

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ మర్చి 10 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ లో నాలుగు మండలాల పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ వారిని నరసింహపురంలో ఆదివాసుల గౌరవ సన్మాన సభలో చట్టి గ్రామపంచాయతీకి చెందిన యువతి, యువకులు కలిసి ఆర్థిక పరిస్థితుల వలన పై చదువులు చదువుకోలేక సొంతంగా వ్యాపారాలు చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మా ప్రాంతంలో మరియు చుట్టుప్రక్కల ఇతర రాష్ట్రాలలో పండించే పంటలు మినుములు,పెసర్లు, నువ్వులు, ఇతరితర పంటలను మా ప్రాంతాలలో వలస గిరిజనేతరుల ద్వారా అక్రమంగా కొనుబడులు సాగుతున్న పరిస్థితి. కాబట్టి స్వయంగా నిరుద్యోగ యువతే కొనుబడి చేసే విధంగా దానికి సంబంధించిన లైసెన్స్ మరియు గిరిజన సొసైటీ భవనం ఆర్థిక సహకారం మీ ద్వారా అందించి ఆదివాసి నిరుద్యోగ భవితకు అండగా నిలవాలని అలాగే ప్రతి ఏట పోలవరం ముంపుకు గురవుతున్న చట్టి, వీరాపురం గ్రామాలకు నష్టపరిహారం పునరావాసం కల్పించాలని వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చట్టి గ్రామ పెసా కమిటీ సభ్యుడు పోడియం. రామకృష్ణ యువతి, యువకులు తుర్రం. అశోక్, తుర్రం. వీర్రాజు తుర్రం.నీల రాజు తుర్రం. పతి, తుర్రం. మూర్తి, తుర్రం. సుబ్బలక్ష్మి, రవ్వ.పార్వతి,విజయ్,రాము, పార్వతి తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *