సాధారణ ఆసుపత్రిలో ప్రత్యేక సదరం శిబిరం విజయవంతం .

* శిబిరంలో ప్రత్యేకంగా గుర్తించిన 44 మంది హాజరు,10 పదిమంది దృష్టిలోప రోగులు హాజరు . * జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్ .

పయనించే సూర్యుడు మార్చి 10 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రత్యేకంగా గుర్తించిన తీవ్రమైన నరాల బలహీనత,తీవ్రమైన కండరాల బలహీనత గల వారికి సోమవారం నాడు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించిన సదరం శిబిరాన్ని డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వివిధ అంగవైకల్యాలతో ధ్రువీకరణ పత్రాలు పొంది,నేటికీ వారి శరీరంలో జరిగిన అధిక మార్పులు గుర్తించిన 56 మందికి నిర్వహించిన ప్రత్యేక సదరం శిబిరంలో ప్రత్యేక వైద్యు నిపుణులు,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. రవికుమార్ నాయక్ ఇతర వైద్య బృందం హాజరైన 44 మందిని ప్రత్యేకంగా పరీక్షలు జరిపారు.అదేవిధంగా ఈరోజు సదరం శిబిరంలో భాగంగా కంటి చూపు దృష్టిలోపం గల వారికి పది మందికి ప్రత్యేకంగా శిబిరంలో పరీక్షలు నిర్వహించారు.దాదాపు 100% అంగవైకల్యం ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో అధిక మొత్తంగా పెన్షన్ మంజూరు చేయనున్నట్లు సదరం అధికారులు తెలిపారు. దృష్టిలోపం ఉన్న వారిని కంటి విభాగపు వైద్యులు డాక్టర్ ప్రియాంక వైద్య బృందం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సదరం శిబిరం అధికారులు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి.శ్రీనివాసులు, క్యాంప్ అడ్మిన్ ఏ. నరసింహారెడ్డి,క్యాంప్ కోఆర్డినేటర్ పి. ప్రభాకర్, క్యాంప్ డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఏ.హైమావతి,ధాన్ గట్ల చంద్రశేఖర్, నర్సింగ్ సూపర్డెంట్ మంజుల, నర్సింగ్ అధికారులు ఎం.ఆనంద్, సిబ్బంది యాదగిరి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *