పయనించే సూర్యుడు మార్చి 10 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గొప్పతనం, సమాజంలో వారి పాత్రను ప్రతిబింబించే ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఈ గీతానికి రెడ్డెపాకుల శ్రీశైలం సాహిత్యం అందించగా, పాలమూరు జయప్రకాశ్ హృద్యంగా ఆలపించారు. మహిళల సాధికారత, వారి కష్టాలు మరియు విజయాలను ప్రతిబింబించేలా ఈ గీతం రూపొందించబడింది. ఆర్‌ఎస్‌టీవీ మ్యూజిక్ జనని ద్వారా విడుదలైన ఈ పాటను అందరూ వీక్షించి ఆదరించాలని నిర్వాహకులు కోరారు. అలాగే ఈ గీతంపై తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎస్‌టీవీ మ్యూజిక్ జనని చానల్‌ను సభ్యత్వం పొందుతూ ఇతరులకు పంచుకోవాలని కూడా కోరారు. గానం: పాలమూరు జయప్రకాశ్ సాహిత్యం: రెడ్డెపాకుల శ్రీశైలం