మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులుమహిళా దినోత్సవం సందర్భంగా 400 మందికి పంపిణీ..

పయనించే సూర్యుడు మార్చి 9, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామం మహాలక్ష్మి నగర్‌లోని తమ నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది మహిళలకు పసుపు, కుంకుమ, పూలు, గాజులు,చీరలు, జాకెట్లు అందజేశారు.అనంతరం మహిళలుచే కేకు కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే సమాజ అభివృద్ధికి పునాది అని అన్నారు. కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తూ సమాజానికి మార్గదర్శకంగా నిలిచేది మహిళలేనని పేర్కొన్నారు. మహిళలు విద్య, ఉపాధి, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో ముందుకు రావాలని సూచించారు. మహిళల ఆత్మవిశ్వాసం పెరిగితే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తాను కూడా ఒక సాధారణ ఇల్లాలిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ భర్త, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి ప్రోత్సాహంతో ప్రజాసేవలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. ప్రజల మద్దతుతో తొలుత జడ్పీటీసీగా సేవలందించే అవకాశం లభించిందని, అనంతరం సంపర ఎమ్మెల్యేగా, తదుపరి కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం వచ్చినట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం కృషి చేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ యే అని.. ఆనాటి నుండి నేటి వరకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ మహిళా పక్షపాతి గా ముఖ్యమంత్రి చంద్ర బాబు పరిపాలన సాగిస్తున్నారని, వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని నారా లోకేష్ కూడా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని కొనియాడారు.మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు చీరలు అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోజిల్లా కమిటీ మహిళా కార్యదర్శి పలివెల గాయత్రి,గొర్రిపూడి ఎంపీటీసీ యనమదల వెంకటలక్ష్మి, నడకుదురు మార్కెట్ కమిటీ డైరక్టర్ గండి వరలక్ష్మి,ఎంపీ సానా సతీష్ కార్యాలయం ఇంచార్జి మేకా లక్ష్మణ్ రావు, రిటైర్డ్ ఎంపిడిఓ విశ్వనాథ్ రెడ్డి,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ కాళ్ళ సత్తిబాబు,క్లస్టర్ ఇంచార్జ్ లు గండి వెంకటేశ్వర రావు,తాతపూడి రామకృష్ణ, మిరపల ప్రకాష్, కొమిరిశెట్టి నరసింగ రావు, మద్దూరి స్వామి,మాజీ జడ్పీటీసీ బుంగా సింహాద్రి, విశ్వనాథ రెడ్డి, కరప, కాకినాడ రూరల్ మండలం లోని వివిధ గ్రామ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు,నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *