నాలుగు లేబర్ కోడ్స్ పై అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరీ కాలనీ -10 ఇటీవల అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్స్ పై అవగాహన కార్యక్రమము సోమవారం జియం కార్యలయం నందు నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) హైదరబాద్, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ శ్రీ బిస్వ భూషణ్ ప్రుస్టి , గౌరవ అతిథులు గా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) మంచిర్యాల, రామగుండం, యం.డి.యూసప్ చౌటుపల్లి, రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ పాల్గొన్నారు. ముందుగా రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, ఇతర అధికారులు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్(సెంట్రల్) హైదరబాద్ రీజియన్ శ్రీ బిస్వ భూషణ్ ప్రుస్టి గారినీ సన్మానించి, స్వాగతం పలికారు. అనంతరం వివిధ గనుల, విభాగాల అధికారులకు, సంక్షేమ అధికారులకు, కాంట్రాక్టర్లకు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) హైదరబాద్ రీజియన్ శ్రీ బిస్వ భూషణ్ ప్రుస్టి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్న 29 చట్టాలను కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ గా 21 నవంబర్ నుండి మార్చడం జరిగినదని, దీని అమలు పై అవగాహన కార్యక్రమం ద్వారా అందరికీ ఉపయోగకరమైన మార్గదర్శకాలు లభిస్తాయని కార్మికుల సంక్షేమం, హక్కులు, భద్రత, వేతన నిర్మాణం, పారదర్శక ఉద్యోగ వ్యవస్థ కోసం, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ కొత్త లేబర్ కోడ్స్ సరిగ్గా అర్థం చేసుకుని అమలు చేయడం అత్యంత అవసరం అని తెలిపారు. కార్యక్రమంలో ఎస్వోటుజిఎంలు యం.రామ్మోహన్, బండి సత్య నారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ కె.జనార్ధన్, విభాగధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *