కేథలిన్ రోని జన్మదినం సందర్భంగా వందలాది మందికి అన్నదానం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 10 శర్మాస్ వ లి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండల కేంద్రంలో బస్టాండ్ లోని ప్రధాన కూడలిలో సోమవారం ఆగాపే ఆశ్రమవ్యవస్థాపకులు బత్తుల ప్రసాద్ కుమార్తె క్యాథలిన్ రోని జన్మదినం సందర్భంగా వందలాది మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాసులు డిప్యూటీ ఎంపీడీవో శశికళ హాజరై చిన్నారి కేథలిన్ రోని చేతుల మీదుగా కేక్ కట్ చేసి చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు . అనంతరం బస్టాండ్ లో , ఆగాపే ఆశ్రమంలో చిన్నారి పుట్టిన రోజు పురస్కరించుకుని ఆగాపే ఆశ్రమ వ్యవస్థాపకులు ఆధ్వర్యంలో 700 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఏమి మా, కెన్నిత్, పాస్టర్లు సంపత్ బాబు, జాన్ సుధాకర్, అనిల్ జాషువా, చార్లెస్, స్టీఫెన్ పాల్, వాసు అనిల్ కాంత్, కాలేబ్, మిత్ర బృందం ఆదిత్య పవన్, ప్రెస్ శీన, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *