సేంద్రియ వ్యవసాయ ఎరువుల అవగాహన

పయనించే సూర్యుడు మార్చి 9 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) ఈరోజు పెద్ద శంకరంపేట మండలంలో గొట్టిముక్కల గ్రామంలో సేంద్రియ వ్యవసాయం విధానంలో భాగంగా పూతా ఖాతాపై కషాయం తయారీ పై వివరణ జరిగింది. దీనిలో భాగంగా కూరగాయల పంటలైన బెండకాయ మెంతం కూరలో కోడిగుడ్డు నిమ్మకాయ రసం మిశ్రమ తయారిపై రైతుకు వివరించడం జరిగింది ఈ మిశ్రమాన్ని తగుపాలలో పిచికారి చేస్తే పూతా కాయలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దీని వలన రైతులు అధిక దిగుబడి పొందే అవకాశం ఉన్నది కావున రైతులు సేంద్రియ వ్యవసాయంపై ముందుచూపి దానిపై వచ్చే దిగుబడులకు అధిక ధరలకు విక్రయించుకొని లాభాలు గడించాలని వివరించడం జరిగింది. గొట్టిముక్కల గ్రామంలోని సాయిలు సేంద్రియ వ్యవసాయాన్ని సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారి మరియు గ్రామ సర్పంచ్ బొండ్ల రవీందర్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *