వెల్జీపురం జడ్‌పీహెచ్‌ఎస్‌లో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి /010 :నియోజకవర్గం స్టఫ్ రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మాన కొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వెల్జీపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కీ.శే. బొల్లారం బాలయ్య, జ్ఞాపకార్థం బొల్లారం బ్రదర్స్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. అలాగే విద్యార్థుల కోరిక మేరకు వీడ్కోలు కార్యక్రమానికి అవసరమైన టెంట్లు మరియు సౌండ్ సిస్టమ్‌ను శ్రీరామ ఈవెంట్స్ వారు సమకూర్చారు. అదేవిధంగా ఇటీవల పాఠశాల ఎ ఎ పి సి కమిటీ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన వోరెం రూపశ్రీ భార్గవ్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వామిరెడ్డి, పాఠశాల కమిటీ చైర్మన్ ఓరెం రూపశ్రీ, గ్రామ సర్పంచ్ నాయిని నవీన్ కుమార్, ఉపాధ్యాయులు హరికృష్ణ రెడ్డి, కుమారస్వామి, శ్రీనివాస్, రాజిరెడ్డి, అనురాధ, అన్నపూర్ణ, అరుణ, వార్డు సభ్యులు బొల్లారం ప్రసన్నకుమార్, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *