ఆక్రమిత ప్రభుత్వ భూములు పేదలకు పంచుతాం

* హెల్త్ సెంటర్, వీవో భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి భూమిపూజ

పయనించే సూర్యుడు న్యూస్ : మార్చి /10 :నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం ఎమ్మెల్యే ఖమ్మం పెళ్లి సత్యనారాయణ, మాట్లాడుతూ..ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం తిమ్మాపూర్ లో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం,మహిళా సంఘ భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు కొందరు తిమ్మాపూర్ లో పలు చోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్టుగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకు వచ్చినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతుంటే చూస్తూ ఉర్కోబోమని ఆయన స్పష్టం చేశారు. తిమ్మాపూర్ లో సర్వేలు జరిపించి ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. ఈ దిశగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. భూమి లేని నిరుపేదలకు ఆ స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. నిర్మాణం పనులు చేపట్టనున్న ఆరోగ్య ఉప కేంద్రం స్థలం వద్ద నీరు నిలవకుండా కాలువ ద్వారా మళ్లించాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సూచించారు. వీవో భవన నిర్మాణాన్ని మే మాసాంతానికల్లా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా నీటి సౌకర్యం కోసం వీవో భవనం వద్ద బోరు వెల్ వేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల వల్ల ఇప్పటికే ఎంతో మంది మహిళలు పారిశ్రామివేత్తలుగా ఎదిగారని ఆయన చెప్పారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు పర్యాయాలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను మోసం చేసిందని డాక్టర్ కవ్వంపల్లి విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని, ఇప్పటి వరకు తిమ్మాపూర్ గ్రామానికి 47 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మలి,తుది విడుతల్లో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో తిమ్మాపూర్ తహశీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి మల్హోత్ర, ఎంపీవో ప్రదీప్, తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ పైడిపల్లి అంజిబాబు, మండల వైద్యాధికారి డాక్టర్ ప్రసిల్లా, డాక్టర్ పుల్లారావు, పశువైద్యాధికారి డాక్టర్ టి.మౌనిక, పంచాయతీరాజ్ ఏఈ స్నేహజ్యోతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు శ్రీగిరి రంగారావు, పార్టీ నాయకులు పోలు రాము,రమేశ్, చింతిరెడ్డి లక్ష్మారెడ్డి, ముప్పిడి సంపత్ రెడ్డి, నగునూరి శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి చింతకింది చంద్రశేఖర్, వార్డు సభ్యులు చిలుకూరి రాజు, నగునూరి రజిత, బొర్ర వంశీ, పోతరాజుల స్వప్న, దేవేందర్, తమ్మనవేణి నర్సయ్య, మాతంగి అంజయ్య,జక్కని నవ్య,సతీష్.మల్లమ్మ,వీవోఏలు నగునూరి మంజుల, ఓరుగంటి శారదరెడ్డి, ఎండీ బిస్మిల్లా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *