దేవరకొండను మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యం

పయనించే సూర్యుడు, మార్చి 10, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవకొండ టౌన్ న్యూస్, త్రాగు నీరు, పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యత. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు అద్భుత పాలన అందించాలి. దేవరకొండ పట్టణ ప్రజలకు నిజాయితీగా సేవలు అందించాలి. *ఎమ్మెల్యే బాలు నాయక్ మున్సిపాలిటీ మొదటి దేవరకొండ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ కమీషనర్ పూర్ణ చందర్ తో కలిసి పాల్గొన్న దేవరకొండ నియోజక వర్గ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.
ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలపై, త్రాగు నీటి సరఫరా, పారిశుధ్యం సమస్యల పరిష్కారానికి పలు ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలకు అతీతంగా దేవరకొండ మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని అన్నారు. దేవరకొండ ను ‘మోడల్ మున్సిపాలిటీ’గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేయాలని, చేపట్టే ప్రతి అభివృద్ధి పని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అండర్ డ్రైనేజీ సమస్యలు, అంతర్గత రోడ్ల మరమ్మతులు, వీధిదీపాల ఏర్పాటు వంటి పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పేదలు, మహిళలు, వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. పట్టణ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించకుండా, జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని, వాటి పురోగతిపై క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ. ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, నేను, ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. మున్సిపాలిటీ నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే మరిన్ని నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కనీషనర్ పూర్ణ చందర్,మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జువేరియా తబస్సుం, మున్సిపల్ ఏ ఈ రాజు,కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *