పదవ తరగతి విద్యార్థులకు స్నేహం చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నుల పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 10 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు అయోధ్య లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సుమారు 50 మంది విద్యార్థులకు రాయికల్ స్నేహం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం అందించారు. దాతల సహకారంతో యస్.ఎల్.ఎన్. కంప్యూటర్స్ కు చెందిన దాసరి రాజ గణేష్, మామిడిపెల్లి రమేష్, బొడగం రఘువీర్ రెడ్డి వారి సహకారంతో ట్రస్ట్ తరఫున విద్యార్థులకు ఈ సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి మేడం, ట్రస్ట్ ఫౌండర్ సందెల విక్రమ్, ట్రస్ట్ సభ్యులు అన్వేష్, సునీల్, విజయ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *