కోడె లక్ష్మయ్య మృతి పట్ల సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ నివాళి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 10 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గత 40 ఏళ్లుగా ప్రజా ఉద్యమాలతో విడదీయలేని అనుబంధం కలిగిన సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ సానుభూతిపరులు కోడె లక్ష్మయ్య మృతి పట్ల ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. సోమవారం ఖమ్మంపాడు గ్రామం లో జరిగిన సంతాప సభలో ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, లక్ష్మయ్య గత నాలుగు దశాబ్దాలుగా పార్టీ ఆశయాలకు కట్టుబడి పనిచేశారని కొనియాడారు. ఈ ప్రాంతంలో జరిగిన అనేక భూ పోరాటాలలో, కూలీల హక్కుల కోసం సాగిన ఉద్యమాలలో ఆయన అగ్రభాగాన నిలిచి చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం స్థానిక ప్రజా ఉద్యమాలకు తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో పార్టీ నాయకులు కంగాల వెంకటేష్, కుంజ వెంకట్రావు, కంగాల శంకర్, సోడెం ముత్యాలు, సోడెం కన్నారావులతో పాటు కోయరంగాపురం గ్రామ సర్పంచ్ సోడెం చిన్న గంగమ్మ మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *