సుందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ పునః ప్రారంభం

పయనించే సూర్యుడు మార్చి 10 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) జనగామ దేవరుప్పుల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రక్కన ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సౌకర్యార్థం రక్షిత తాగునీటికై మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ను గతంలో ఏర్పాటు చేయనైనది.ప్రస్తుతం ఆ మినరల్ వాటర్ ప్లాంట్ పూర్తి బాధ్యత నిర్వహణ సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చేపట్టి సోమవారం ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ మాట్లాడుతూ సుందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక రకాలైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నర్ర కోమలత సోమశేఖర్, వార్డు సభ్యులు సందీప్, బలరామ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లొడంగి వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు చిలుపురం సోమయ్య, నీలారపు వేణు, తోటకూరి కిష్టయ్య, మధు, రమేష్, కిరణ్, శ్రీను, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *