పయనించేసూర్యుడు న్యూస్ మార్చ్10 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని మండలం పెద్ద హరివాణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఏ. తౌఫిక్,హెచ్. అజయ్, హెచ్. మధుమతి, బి.పి.ఉమా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి రామచంద్రారెడ్డి తెలియజేశారు విద్యార్థుల అభివృద్ధికి కృషి చేసిన గణిత ఉపాధ్యాయుడు జి నాగేంద్రను, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు రవికుమార్, జీవ శాస్త్ర ఉపాధ్యాయులు,వి నవీన్ కుమార్ ను ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ రమేష్, గ్రామ పెద్దలు మరియు తల్లి దండ్రులు అభినందించడం జరిగినది.