పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 10 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు అలాగే పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు తరగతి గదులు తాగునీరు మరుగుదొడ్లు వంటి సమస్యలను కూడా పరిశీలించారు విద్యార్థులు ఉపాధ్యాయులు తెలిపిన సమస్యలను వెంటనే సంబంధిత అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు