ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డి కి ఘన సన్మానం

* నరసింహపురం కొమరం భీమ్ యూత్ మరియు గ్రామస్తులు ఆధ్వర్యంలో ఘన సన్మానం

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ మర్చి 10 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చిడుమూరు పంచాయతీ చింతూరు మండలం నరసింహపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్,, ప్రజా వారిది కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్ సొళ్ల బొజ్జి రెడ్డి కి నరసింహపురం కొమరం భీమ్ యూత్ మరియు గ్రామస్తుల ,ఆదివాసీ సంఘాలు ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆయనకి సన్మాన కార్యక్రమం బొకేలు,సాలువ కప్పి ఆయనకు సన్మానం చేశారు, అయన సన్మాన సమావేశం లో మాట్లాడుతూ మొదటగా నేను పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కారం దిశగా పనిచేస్తాను అని అలాగే ఎటువంటి సమస్య వచ్చిన నా దగ్గర తీసుసుకురావాలి అన్నారు కార్యక్రమంలో చింతూరు మండల ఆదివాసీ సంఘాల ఆదివాసి పెద్దలు అందరూ వచ్చిఈ కార్యక్రమని ఎంతో పటిష్టంగా విజయవంతం చేశారు, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కొమరం భీమ్ యూత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చట్టి యువత, ఆదివాసి ఎంప్లాయిస్ వివిధ శాఖల్లో ఉన్న ప్రతి ఒకరికి పేరుపేరునా ధన్యవాదాలు కొమరం భీమ్ యూత్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *