వడ్డే రామ్మూర్తి కుటుంబానికి రూ.4.72 లక్షల భీమా చెక్కు పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 10 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ మంత్రాలయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మంజూరైన రూ.4.72 లక్షల భీమా చెక్కును మృతుడు వడ్డే రామ్మూర్తి కుమారుడు వడ్డే రవి కిరణ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య మాట్లాడుతూ భీమా పథకాలు కుటుంబాలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు. కుటుంబ పోషకుడు మరణించినప్పుడు ఇలాంటి భీమా అమౌంట్ బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. స్థానిక రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన వడ్డే రామ్మూర్తి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏడాదికి రూ.30 వేల చొప్పున 15 కంతులు చెల్లించే విధంగా పాలసీ తీసుకున్నారని వివరించారు. ఆయన మృతి చెందడంతో పాలసీ నిబంధనల ప్రకారం రూ.4.72 లక్షల భీమా సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *