శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దివ్యాంగుల ఉపాధిసంక్షేమ భవనం ఏర్పాటుచేయాలి

పయనించే సూర్యుడు, మార్చి 10 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ శేరిలింగంపల్లి దివ్యాంగుల పట్టణ సమై క్య సంఘం అధ్యక్షులు మేకల అశోక్ కుమార్ ముదిరాజ్. ఆధ్వర్యంలో శేరి లింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్ఖాడే హేమంత్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడు తూ… శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దివ్యాంగుల స్వయం ఉపాధి సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గంలో దాదాపు 3000 నుండి 4000 మంది వివిధ రకాల దివ్యాంగులు ఉన్నారని దివ్యాంగులకు అంటూ ఎలాంటి భవనములు లేక ప్రతి నెల సమైక్య సంఘం సమావేశాలు, ఉపాధి చేసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామన్నారు. మరియు మానసిక వైకల్యం ఉన్న దివ్యాంగులకు వృత్తిపరమైన ప్రత్యేక గల కోర్స్ చేసుకోవటానికి భవనం కావాలని మా దివ్యాంగులపై దయ ఉంచి శేరిలిం గంపల్లి సర్కిల్ 49 మసీదు బండలో ఉన్న ప్రభుత్వ కమిటీ హాల్ ను అధికారి కంగా దివ్యాంగుల స్వయం ఉపాధి సంక్షేమ భవనానికి కేటాయిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ రావు ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *