డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి ఏమిటి?

* ఎం హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్.

పయనించే సూర్యుడు మార్చ్ 11 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఆదోని ప్రభుత్వాసుపత్రులను బాగు చేసేందుకు ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథి కృషి చేయకపోవడం బాధాకరం. దీనిని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తోంది. మహిళా శిశు ఆసుపత్రి లో సోమవారం రోజు వందలాది గర్భిణులు స్కానింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి రావడం, రద్దీ ఎక్కువగా ఉండటం, స్కానింగ్ యంత్రాల కొరత కారణంగా వారు నరకయాతన అనుభవించాల్సి రావడం చూస్తే గుండె తరుక్కుపోయింది. ఆదోనిలో పేదలుగా పుట్టడమే ఆ మహిళలు చేసిన పాపమా అని ఎమ్మెల్యే పార్థసారధి ని ప్రశ్నిస్తున్నాము. ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు అవుతున్నా ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి పనితనం సోషల్ మీడియాను దాటి ముందుకు సాగడం లేదు. అసెంబ్లీ లో వంద శాతం హాజరు ఉన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి ఆదోని పట్టణంలో మాత్రం ఇరవై శాతం హాజరు కూడా లేకపోవడంతో ఆదోని నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అందని ద్రాక్షగా మారింది మరియు ఇబ్బందులు తప్పడంలేదు. కావున ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆదోని నియోజక వర్గంలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ఆదోని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఎమ్మెల్యే పార్థసారధి నిర్లక్ష్య పాలన పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి, మంత్రి నారా లోకేష్ కి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే ని హెచ్చరిస్తున్నాము. ఎ.నూర్ అహ్శద్ ⁠యం హెచ్ పి యస్ ⁠రాష్ట్ర కార్యదర్శి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *