మంత్రికి గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం.

* పాల్గొన్న కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ

పయనించే సూర్యుడు మార్చి 11 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదోని మండల పరిధిలోని మంత్రికి గ్రామంలో మంగళవారం “స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. కృష్ణమ్మ సేవా సైన్యం వాలంటీర్లతో కలిసి గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం ముందు, అలాగే ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడికను తొలగించి శుభ్రపరిచారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల్లో స్వయంగా చీపురు పట్టి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, రోగాలు దరిచేరవని తెలిపారు. గ్రామాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, స్వచ్ఛతను అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యమన్నారు.
కార్యక్రమం సందర్భంగా గ్రామస్థులు తమ సమస్యలను జిల్లా అధ్యక్షురాలు దృష్టికి తీసుకువచ్చారు. ఇల్లు నిర్మించుకుంటున్నామని, బిల్లులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కొంతమంది కోరారు. అలాగే ఇటీవల వలస వెళ్లి ప్రమాదానికి గురైన వ్యక్తికి పెన్షన్ మంజూరు చేయాలని ఆమె దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన గుడిసె ఆది కృష్ణమ్మ వెంటనే పంచాయతీ కార్యదర్శికి సదరం సర్టిఫికేషన్ స్లాట్ బుక్ చేసి సంబంధిత ధ్రువపత్రం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు గుడిసె శ్రీరాములు, కొత్తూరు సర్పంచ్ నాగరాజ్, అంబేద్కర్ సొసైటీ చైర్మన్ జాలమంచి రంగస్వామి, మాజీ ఎంపీపీ మురళి, మాజీ సర్పంచ్ మాదవ్, బైచిగేరి ఓంకార్, గోపాల్, మంత్రికి ముని, వెంకటేష్, రామాంజిని నాగేంద్ర మహదేవ సాదిక్ వలి, రాఘవరెడ్డి, బల్లెకల్ బసవరాజ్, సవారయ్య, బంగారు బాబు, కాసిం అశోక్, చిట్టి పెద్ద చిట్టి చంద్ర వీరేష్ విజయ్ భరత్ గంగాధర్ రంగస్వామి తిమ్మప్ప గిడ్డయ్య దొడ్డిన గిరి గజేంద్ర ఆర్ఎంపి భాష, విద్య కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, ఈరన్న, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *