పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ” కట్ట సంతోషన్న”  పెండ్లి కానుక , రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేత

* పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు  సహాయం అందించడం నా సామాజిక బాధ్యత_ బిఆర్ఎస్ యువనేత, సామాజిక వేత్త కట్ట సంతోష్ కుమార్ * సేవాభావం ఉన్న వాళ్ళు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారు _ సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్

పయనించే సూర్యుడు మార్చి 11, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ బిఆర్ఎస్ పార్టీ యువనేత, సామాజిక వేత్త కట్ట సంతోష్ కుమార్ తన ఉదారతను చాటుకున్నారు. రాజాపూర్ మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన చాకలి లక్ష్మమ్మ కుమార్తె సరస్వతి వివాహానికి రూ. 15,000/- నగదును ఆర్థిక సాయంగా అందజేశారు. ఈ సందర్భంగా  గ్రామం లోని పేదల కుటుంబాలకు  సంతోష్ కుమార్  లాంటి  సామాజిక వేత్తలు, సేవా భావం కలిగిన వారు తమ వంతు సహాయం అందించడం సంతోషంగా ఉందని , భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని తిరుమలపూర్ సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్ తో పాటు పలువురు నాయకులు, గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిర్మలాపూర్ సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్, డిప్యూటీ సర్పంచ్ మంత్రి రామ్ చందర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు చుక్క మల్లయ్య, ఎన్నం జగదీశ్వర్, ఎన్నం కుమార్, మహీందర్ రెడ్డి , వార్డు సభ్యులు రెడ్యానాయక్, చుక్క రాజు, శ్రీశైలం, నాయకులు అనిరుద్, సలాం పాషా, చుక్క నర్సిములు, పురుషోత్తం రెడ్డి, కిషోర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, చుక్క మల్లేష్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *