పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోం:- ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి

పయనించే సూర్యుడు మార్చి 11 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. మంగళ వారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదోని పట్టణంలో బంగారు వ్యాపారుల మోసాలపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు .కౌతాళం మండలం తోవి గ్రామానికి చెందిన దేవేంద్రప్ప మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని కలిసి తన సమస్యను వివరించారు. బంగారం వ్యాపారుల చేత మోసపోయామని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన లేదని ఆయన తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రంగా స్పందించారు. అమాయక రైతులు, పేద ప్రజలను మోసం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. బంగారు షాపు లు వారి వ్యాపారాలు ఆర్డీవో కార్యాలయం లో రిజిస్టర్ చేసుకొని ప్రభుత్వ నిబంధనకు లో వడి వారి వ్యాపారాలు చేసుకోవాలని హెచ్చరించారు. బంగారు వ్యాపారాల సంఘం వారు కూడా దీనికి బాధ్యత తీసుకోవాలని ఘాటుగా హెచ్చరించారు. తమ ఇష్టం వచ్చినట్లు వ్యాపారం చేసుకొని పేద ప్రజల కు అన్యాయం చేస్తే ఏoతా వారిననియన వదిలిపెట్టేది లేదని ద్వజమెత్తారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధితులకు కచ్చితంగా న్యాయం చేసి తీరుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *