ప్రెస్ క్లబ్ బ్రోచర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్

* సమాజంలోని మంచి చెడులను వెలికితీయుటలో ముందుండాలని హితావు * ప్రజలకు ప్రభుత్వాలకు వారధులు జర్నలిస్టులే

పయనించే సూర్యుడు, మార్చి 11, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ మన భద్రాద్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియావెల్ఫేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 34/26 బ్రోచర్ ను మంగళవారం తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కె ఆర్ కె వి ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ ఇటీవలే నూతనంగా ఎడారి రమేష్ అధ్యక్షతన ఏర్పాటైన ప్రెస్ క్లబ్ కు తాసిల్దార్ స్వాగతం పలికారు.ప్రజా సమస్యలపై ఎటువంటి తారతామ్యాలు లేకుండా ప్రభుత్వాలకు ప్రజలకు వారదులుగా జర్నలిస్ట్ మిత్రులు పోషిస్తున్న పాత్ర అమోఘమని వ్యాఖ్యానించారు. అదేవిధంగా సమాజ శ్రేయస్సుకై నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయాలని హితావు పలికారు. నాలుగవ ఎస్టేట్ గా పిలవబడే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా వాయిస్ విలేఖరి మరియు అధ్యక్షుడు ఎడారి రమేష్, ఏ టీవీ న్యూస్ బిట్ర సాయిబాబా, హైదరాబాద్ పల్స్ గోనెల సతీష్, తొలి వార్త న్యూస్ నరసింహారావు, తెలంగాణం న్యూస్ జాస్తి శివరాం, నవ భూమి రిపోర్టర్ శనగ మల్లేష్, విశాల భారతి రిపోర్టర్ బర్ల ప్రభాకర్ రావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *