ఆశ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ

* నూతనకల్ గ్రామంలో పదో తరగతి విద్యార్థులకు విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ తెల్లపుట్ట శ్రీదేవి ఉపసర్పంచ్ తెనాలి సత్యం

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 11,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల పరిధిలోని నూతనకల్ గ్రామంలో ఆశా స్వచ్ఛంద సంస్థ వారు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడులను అందించే కార్యక్రమంలో భాగంగా నూతనకల్ గవర్నమెంట్ హైస్కూల్ పదవ తరగతి విద్యార్థులకు గ్రామ సర్పంచ్ తేల్లపుట్ట శ్రీదేవి ఉప సర్పంచ్ తెనాలి సత్యనారాయణ పరీక్ష ప్యాడు లను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలను జాగ్రత్తగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులందరూ ఉన్నత స్థితిలోకి వెళ్లాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు, వార్డు మెంబర్లు, గ్రామపంచాయతీ సెక్రటరీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *