
పయనించే సూర్యుడు మార్చి 11 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే 2026,2027 బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి 5000 కోట్ల కేటాయించాలని కేజీ కేఎస్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్లే వెంకట మల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం ఈరోజు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జిల్లా అధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య ఆధ్వర్యంలో జరిగింది అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బాల్నే వెంకట మల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కల్లుగీత వృత్తి ప్రమాదంలో మరణించిన వారికి ఎక్స్ గ్రేషియా 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచుతాం అన్నారు గీత కార్మికులకు వృత్తి పించిను 2000 నుండి 4000 రూపాయలు ఇస్తామని చెప్పారు లిక్కర్ షాపుల్లో గతంలో 15% ఉన్న రిజర్వేషన్లను 25% శాతానికి పెంచుతామని అని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని టి ఎఫ్ టి సొసైటీలకే ఇవ్వాలని 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలి ప్రభుత్వ భూమి లేనిచో కొనీ ఇవ్వాలి అలాగే 2003 – 2004 సంవత్సరంలో కోటివరల కింద జిల్లాలో 48 గ్రామాలకు భూమి కొనివ్వడం జరిగింది ఇచ్చిన భూమిలో తాటి ఈత జిలుగు హైబ్రాడ్ మొక్కలు నాటి వాటి సంరక్షణకు నీరు వసతి కల్పించి వాటి చుట్టూ ఫినిషింగ్ చేయాలి జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎక్స్ గ్రేషియా సుమారు రెండు కోట్ల 30 లక్షల రూపాయలు ఇవ్వవలసి ఉండగా ఇందులో కేవలం 43 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది మిగతావి తక్షణమే విడుదల చేయాలని జనగామ జిల్లాలో 28000 వేల కుటుంబాలు కల్లుగీత వృత్తి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు జనగామ జిల్లాలో తాటి ఈత నీరా ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు చేసి యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కల్లుగీత కార్మికులకు ద్విచక్రవాహనాలు ఇవ్వాలని హైదరాబాదులో నక్లెస్ రోడ్ లో మూసివేసిన నీరా కేఫ్ తక్షణమే తెర్పించాలి. జిల్లాలో 11 వేల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు ఇప్పటివరకు సుమారు 2300 మందికి మాత్రమే కాటమయ్య రక్షణ కిట్లను ఇచ్చారు సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కాటమయ్య రక్షణ కిట్లను ఇవ్వాలని జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కంకటి రాజయ్య, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్, బండపల్లి శంకరయ్య, జిల్లా కమిటీ సభ్యులు బసవ గాని మహేందర్, బైరగోని బలరాములు, ఉడుగుల ప్రభాకర్ , వడ్లకొండ వెంకటేష్ ,బుసిగంపల సమ్మయ్య, యాదండ్ల పరంధామ, పోతుగంటి కృష్ణమూర్తి, కుర్ర రాజు నామాల యాదగిరి, బాల్నే కార్తీక్ ,మూల కిరణ్, బాల్నే రాజయ్య, పనస శ్రీనివాస్, నాయిని యాదగిరి, తాళ్ల పెళ్లి అంజయ్య ,బైరగోని వెంకటయ్య, తాళ్లపల్లి అశోక్, అంబాల యాదగిరి, బెజ్జం ఆంజనేయులు, బైరు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.