రేపటి యూత్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలి

* ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్

పయనించే సూర్యుడు మార్చి 11 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఉట్నూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కాకతీయ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ తెలిపారు మంగళవారం కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు ఈ యూత్ ఫెస్టివల్‌లో పాల్గొననున్నారని చెప్పారు విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు మొత్తం 12 విభాగాల్లో సాహిత్యం సాంస్కృతికం కళారంగానికి సంబంధించిన పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధ్యాపకులు విద్యార్థులు సమన్వయంతో పని చేయాలని కోరారు ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ సాయిప్రసాద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *