నేటి సమాజానికి చైతన్య మూర్తి సావిత్రిబాయి పూలే

పయనించే సూర్యుడు 11-03-2026 నేరేడుచర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్ ) మహిళా చైతన్య మూర్తి సావిత్రిబాయి పూలే అని బీసీ హక్కుల సాధన సమితి సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షుడు చిలకరాజు శ్రీను అన్నారు. మంగళవారం నాడు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రధాన కూడలిలో సావిత్రిబాయి పూలే 129 వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తొలితరo ఉపాధ్యాయురాలు, మహిళల విద్యా హక్కుల కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, అలుపెరుగని పోరాటం చేసిన అసహన సాహసవంతురాలు అని, దేశంలో సగభాగమైన మహిళలకు విద్య అవకాశాలు లేకపోతే వారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగక పోతే దేశం ఎలా ముందుకు వెళుతుంది అని ఆమె మదిలో మెరిసిన ఆలోచనను ఆచరణలోకి పెట్టి ఆనాటి మత చాoదస వాదులు ఎన్ని అవాంతరాల సృష్టించిన వెరువకుండా వెన్ను చూపకుండా తను నమ్మిన ఆశయం కోసం ముందుకు కొనసాగి తన భర్త జ్యోతిరావు పూలే అండదండతో 200ల ఏండ్ల క్రితమే అభ్యుదయ బాటలో నడిచిన మహా యోధురాలు సావిత్రిబాయి పూలే అని ఆయన గుర్తుచేసుకున్నారు. నేటితరం మహిళలు ముఖ్యంగా బాలికలు సావిత్రిబాయి పూలే జీవితాన్ని అధ్యయం చేసి ఆమె ఆశయ సాధన కోసం అంకితం కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎడవల్లి అరుణ్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి సుందరయ్య జంగిలి వెంకటేశ్వర్లు రాపోలు నవీన్ బత్తిని శ్రీనివాస్ తక్కెళ్ళ నాగార్జున కొదమగుండ్ల నరేష్ సతీష్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *