పాడి రైతులు పశువులకు తప్పనిసరిగా టీకా వేయించాలి

* జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

పయనించే సూర్యుడు మార్చి 10, దండేపల్లి పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ . మంగళవారం దండేపల్లి మండలం రాజంపేట గ్రామంలో జిల్లా పశుసంవర్ధక, పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమానికి జిల్లా పశువైద్య శాఖ అధికారి యాకుబ్ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాడి రైతుల ఆర్థిక అభివృద్ధి, పశువుల సంక్షేమం దిశగా ప్రభుత్వం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, గత సంవత్సరం 100 శాతం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. పాడి పశువులు, మేకలు, గొర్రెలు, పౌల్ట్రీ పారాలలో గాలికుంటు వ్యాధి నివారణ దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అవసరమైన మందులను అందిస్తుందని, జిల్లాలో పశు వైద్యాధికారులు అందుబాటులో ఉన్నారని, పాడి రైతులు తమ పశువులకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. రైతులు వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమను నిర్వహిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఉత్పత్తి ఉత్పాదకత పెంపొందించే దిశగా కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలు, ప్రణాళికలను, లైవ్ స్టాక్ పథకంలో ప్రభుత్వం 50 శాతం రాయితీ అందిస్తుందని తెలిపారు. గ్రామంలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఆశ్రయం పొందుతున్న వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామపంచాయతీ కార్యాలయం, నర్సరీ లను సందర్శించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హత గల ప్రతి ఒక్కరికి అందించాలని, నర్సరీలలో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని ద్వారక గ్రామంలో గల షెడ్యూల్డ్ తెగల సంక్షేమ వసతి గృహ నిర్మాణ పనులను సందర్శించి పనులు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యాబోధన తీరు అంశాలను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్య బోధన చేయాలని, వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అనంతరం గ్రామంలోని గోదావరి నది తీరం సమీపంలో పుష్కర ఘాట్ ఏర్పాటుపై అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వెల్గనూరు గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలోని రెబ్బెనపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల స్థలానికి పరిశీలించి నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, విద్యాబోధన తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాన్ని పరిశీలించి పల్లె దవాఖాన ను సందర్శించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, వేసవి దృష్ట్యా వడదెబ్బకు గురి కాకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం మండలంలోని గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయాన్ని మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి ఆలయ అభివృద్ధి, వాహనాల పార్కింగ్ అంశాలను పరిశీలించి పర్యాటక రంగ అభివృద్ధి దిశగా అవసరమైన భూములను పరిశీలించి వివరాలతో నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మోట పలుకుల సత్తయ్య .సర్పంచ్ కుడిమేత తిరుపతి .ఎండి ఫయాజ్ .మొగిలి. కమలాకర్. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *