కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం.

విద్యార్థుల ఆరోగ్యానికి ముందడుగు – గౌరారం స్కూల్లో వాటర్ ప్లాంట్

పయనించే సూర్యుడు. మార్చి 11. నాగర్ కర్నూల్ జిల్లా, తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్ తెల్కపల్లి మండలం గౌరారం ప్రాథమికోన్నత పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంటును ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా పాఠశాలలోని విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి వచ్చిందని పాఠశాల విద్యార్థులతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈ త్రాగునీరు అందుబాటులో ఉంటుందని . ప్రతి విద్యార్థికి ఒక స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరారం గ్రామ సర్పంచ్, మల్లీశ్వరి మండల విద్యాధికారి సి.శ్రీనివాస్ రెడ్డి , ఉప సర్పంచ్ జూపల్లి మల్లయ్య కమ్యూనిటీ డెవలప్మెంట్ అసిస్టెంట్ మేనేజర్, శ్రీనివాస రావు , ముజీబ్ , ఎ ఎ పి సి చైర్ పర్సన్ గోవిందమ్మ ,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సి, విశ్వేశ్వర్ రెడ్డి మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *