యూసుఫ్‌పేటలో 10వ తరగతి విద్యార్థులకు స్టేషనరీ అందజేత

పయనించే సూర్యుడు మార్చి 11. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటకు చెందిన అడ్వకేట్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు స్టేషనరీ సామగ్రి పంపిణీ చేశారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన పెన్నులు, పెన్సిల్లు, కవర్లు, ఎరేజర్లు, షార్ప్నర్లు, స్కేలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇటువంటి సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అడ్వకేట్ సాయిబాబా గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *