పయనించే సూర్యుడు మార్చి 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పీఎం శ్రీ పాఠశాల జిల్లాస్థాయి ఆటల పోటీల్లో రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం బూర్గుల జడ్పీహెచ్ఎస్ కు చెందిన వికాస్ జిల్లా స్థాయిలో షాట్ పుట్ త్రో లో రెండవ స్థానం లో నిలిచాడు. మరియు త్వరలో జరిగే పీఎం శ్రీ పాఠశాల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక ఇవ్వడం జరిగింది. దీంతో బూర్గుల జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు రవికుమార్ మరియు వ్యాయామ ఉపాధ్యాయులు జగదీశ్వర్ మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు వికాస్ ను అభినందించారు.