పయనించే సూర్యుడు: మార్చి 11 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ ఈరోజు బాలానగర్ మండలం కేంద్రంలో సావిత్రి భాయ్ పూలే వర్ధంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించిన అంబేద్కర్ సంఘం ఎమ్మార్పీఎస్ దళిత ప్రజా సంఘాల నాయకులు ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళమెత్తిన గొప్ప సంఘ సంస్కర్త, మహిళ విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు దివంగత సావిత్రిబాయి పూలే అని స్మరిస్తూ ఆ మహనీయురాలి వర్ధంతి సందర్భంగా సేవలను కొనియాడుతూ ఘననివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నేరెళ్లపల్లి యాదయ్య వసుప్పుల శేఖర్ ఆరేళ్ల యాదయ్య శ్రీను కురువ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు