12 టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా డాక్టర్ కవ్వంపల్లి పదవీ స్వీకారం

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి /11: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ విభాగం చైర్మన్ గా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం పదవీ స్వీకారం చేయనున్నారు. గాంధీభవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ సాగుతుంది.అనంతరం టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ గా పదవీ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని, అలాగే మానకొండూర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల నుంచి పార్టీ ఎస్సీ సెల్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *