ప్రశాంతంగా పరీక్షలు రాయాలి *మాట్లాడుతున్న ఇంచార్జి హెచ్ఎం శ్రీకృష్ణ.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 11 బోధన్ :మార్చ్ 14వ తేది నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష కేంద్రంలో గందరగోళానికి గురి కాకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేసీ ఇంచార్జి హెచ్ఎం శ్రీకృష్ణ అన్నారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటుచేసిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సంధర్బంగ విద్యార్థులు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులతో వారి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటు భారమైన హృదయంతో వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, ఖైరాన్, జ్యోతి, సంజీవ్, వెంకట్, రామ్మోహన్, విద్యాసాగర్, రాకేష్, కిశోర్, నాగేశ్వరరావు, స్నేహ, కళ్యాణి, రాజ్యలక్ష్మీ, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *