గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 11 బోధన్ :తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో బోధన్ మండలం అన్ని గ్రామాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బోధన్ మండల ఏడి రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ద్వై-వార్షిక ఆరు నెలలకు ఒకసారి టీకాలు10 మార్చ్ 9 ఏప్రిల్ వరకు వేయించడం అత్యంత అవసరం. ఈ టీకాలు వ్యాధి వ్యాప్తిని తగ్గించి, పశువుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రభుత్వం తరపున ఉచిత టీకాల కార్యక్రమాన్ని గ్రామాల్లో పాడి రైతులు 6 నెలలో దూడల నుండి పశువులకు ఆవులకు వేయించుకొని సద్వినియోగం చేసుకొని తమ పశువులను వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ విఏఎస్ నారాయణ వియల్ఓ శ్రీనివాస్ ఎల్స్ఏ ఆరిఫ్ నాగన్ పల్లి సర్పంచ్ వినోద్, గోపాలమిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *