నాగర్ కర్నూల్‌లో 13న మెగా జాబ్ మేళా.

పయనించే సూర్యుడు మార్చి 11 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 13న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్ తెలిపారు.జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్‌లో గల ఆర్ట్స్ కళాశాలలో రెండు కళాశాలల ఆధ్వర్యంలో ఈజాబ్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.దాదాపు 10 కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలోపాల్గొననున్నాయని తెలిపారు.డిగ్రీ పూర్తి చేసిన వారు అలాగే ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సమక్షంలో మెగా జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మరిన్ని వివరాలకు 89857 47301 జేకేసి ఇంచార్జి రామకృష్ణ ను సంప్రదించగలరు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమన్వయకర్త అంజయ్య,కళాశాల అధ్యాపకులు ప్రసాద్, అధ్యాపక బృందం,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *