పయనించే సూర్యుడు మార్చి 11 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ రైతుల సమస్యలు అధికారులకు పట్టవా రైతులు అంటే అంత చులకన రైతులు లేకుంటే మీరు ఉంటారా రైతుల పంటలు ఎండిపోతుంటే మీరు చూస్తూ ఎలా ఉంటారని రైతులు అధికారులను నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది. రైతే రాజు అని చెప్పుకునే సామెత ఎక్కడ అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి రిజర్వాయర్ కే ఎల్ ఐ కాల్వ ద్వారా ఉయ్యాలవాడ, శ్రీపురం, తుడుకుర్తి ,నల్లవెల్లి గ్రామ రైతుల పంట పొలాలకు నీరు పారుతుండే, గత వారం రోజులుగా పంట పొలాలకు నీరు అందక సాగు చేస్తున్న పంటలు మొక్కజొన్న, వరి, వివిధ రకాల పంటలు ఎండిపోతున్నాయని, అలాగే కరెంటు, యూరియా తిప్పలు తప్పడం లేదని మండిపడ్డారు.రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రైతుల పక్షాన రైతుల పంట పొలాలకు నీరు అందించాలని సూచించిన అధికారులు మాత్రం పెడచెవిన పెట్టుకుని రైతులను ముంచుతున్నారు.సర్కార్ పేట గ్రామ సమీపంలో ఉన్న కే ఎల్ ఐ కాలవ దగ్గర రైతులు ఆందోళన చేస్తున్న ఇరిగేషన్ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు మండిపడ్డారు. తమ పంట పొలాలకు నీరు అందాలని అధికారులను ప్రభుత్వాన్ని రైతులు కోరారు.