దొమ్మట గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం ప్రారంభం

పయనించే సూర్యుడు మార్చ్ రాజేష్ 11) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మట గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నేటి నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. మండలంలోని ప్రతి గ్రామంలో నిర్దేశిత తేదీల ప్రకారం పశువైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ పరశురాం, వెటర్నరీ అసిస్టెంట్ సుదర్శన్, వీఎల్వోపీ నర్సింలు, ఎన్. సమ్మయ్య, పి. శిల్ప, కే. వెంకటయ్య, దొమ్మట గ్రామ సర్పంచ్ దేవిగారి అంజయ్య, ఉప సర్పంచ్ శేఖర్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *