116వ రోజు కొనసాగిన ఆదోని జిల్లా సాధన దీక్ష

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 12 ఆదోనిడివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన 116వ రోజు దీక్షకు మద్దతుగా మేము సైతం అంటూ న్యాయవాదులు దీక్షలో కూర్చున్నవారు, రామాంజనేయులు, రవికుమార్ నరసన్న వేమరెడ్డి తరుణ్ ప్రసాద్ మరియు తదితరులు కూర్చొని ఆదోని జిల్లా సాధన కోసం మేము సైతం అంటూ జిల్లా కోసం దీక్షలో కూర్చోవడం జరిగింది దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావంగా, జీవి దేశాయ్ అడ్వకేట్, కెవి బద్రీనాథ్ అడ్వకేట్, కే మల్లికార్జున అడ్వకేట్, డి నాగరాజు అడ్వకేట్, జే అక్షయ్ కుమార్ అడ్వకేట్, బీసీ నరసింహులు, హెచ్ఎం విశ్వనాథయ్య, పాల్గొని మద్దతు తెలుపుతూ వారు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లా చేయాలి అత్యంత వెనుకబడిన ఐదు నియోజకవర్గాలు అందులో ఆదోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆదోనిని జిల్లా చేయాలి ఎందుకంటే తెల్ల బంగారాన్ని విదేశాలకు ఎగుమతి చేసిన ఆదోని గతంలో సెకండ్ ముంబాయిగా పిలవబడింది బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం భౌతికంగా అన్ని అర్హతలు కలిగిన ఐదు నియోజకవర్గాలు కలిపి ఆదోని జిల్లా చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సాధన కమిటీ నాయకులు సుజ్ఞానమ్మ,పగడాల కోదండ, బండారి హనుమంతు, వైపి నాగరాజు, సుభాష్ చంద్రబోస్, గుమ్మల బాలస్వామి, మాదాసు జగన్, సద్దాం హుస్సేన్ డి గోవిందు. నరేష్,మరియు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *