కౌమార బాలికలకు హెచ్ పి వి వ్యాక్సిన్ రక్షణ

పయనించే సూర్యుడు న్యూస్, మార్చి12 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):కౌమార బాలికలనుగా 14 సంవత్సరాలు పైబడి ఇంకా వివాహం కాని బాలికలకు హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖ క్యాన్సర్ ను(సర్వైకల్ క్యాన్సర్) నిరోధించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని,భారత దేశంలో గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉందని డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అధికారి ఎస్ స్వప్న,కాకినాడ జిల్లా డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ ఎన్ ప్రశాంతి పేర్కొన్నారు.ఈ మేరకు వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క 14 సంవత్సరాలు నిండిన బాలికలు 15 సంవత్సరాలలోపు ఉన్న బాలికలు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.హెచ్ పి వి వ్యాక్సిన్ సురక్షితమైనది మరియు అత్యంత ప్రభావంతమైనది అని ఆమె అన్నారు. బయట మార్కెట్లో వేలాది రూపాయలు విలువచేసే ఈ వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది అన్నారు.అనంతరం 14 సంవత్సరాలు నిండిన బాలికలకు హెచ్ పి వి వ్యాక్సిన్ ను ఇంజక్షన్ రూపంలో ఇచ్చారు. ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జే.అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సిహెచ్ భవ్య శ్రీ,బి.శ్రీకాంత్, ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రధాన వైద్యులు వి రమేష్, సిహెచ్ఓ పి మాణిక్య కుమారి, హెల్త్ సూపర్వైజర్ కె దైవ కృప, హెల్త్ అసిస్టెంట్లు, ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *