పయనించే సూర్యుడు న్యూస్ 12 యాడికి మండలం కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో కర్నూలు జిల్లా వాస్తవ్యులు జి. రామాంజనేయులు, భార్య గంగమ్మ ,కుమార్తె రోహిణి, కుమారుడు దినేష్ వీరి కుటుంబము దూర ప్రాంతంలో ఉంటున్నప్పటికీ అన్నదానం చేయాలని కోరికతో, పెద్దల ఆశీస్సులు కావాలని అగాపే ఆశ్రమాన్ని ప్రేమించి వారి కుమార్తె రోహిణి పుట్టినరోజు శుభ సందర్భంగా ఆశ్రమంలోని నిరాశ్రయులకు, వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలో వారంతా మరి కుమార్తెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
