
పయనించే సూర్యుడు. మార్చి 12. నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం. రిపోర్టర్ :సుల్తాన్ తెల్కపల్లి మండలం ఆలేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు సమావేశం సందర్భంగా యువజన నాయకులు దేశామోని ఆంజనేయులు పాల్గొని. విద్యార్థులకు పరీక్షల పట్ల పలు సూచనలు మెలకువలు సూచనప్రాయకంగా తెలియజేశారు అదేవిధంగా ఆలేరు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో క్రమశిక్షణతో ఉపాధ్యాయులు చెప్పిన పాటలను ఆత్మ విమర్శ చేసుకొని సమయపాలన పాటించి పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా కొనసాగాలని ఆయన అన్నారు. అట్లాగే ప్రధాన ఉపాధ్యాయులు జి నరహరి మాట్లాడుతూ విద్యార్థులకు కావలసిన సమాచారం సదుపాయాలు పరీక్షలో అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని విద్యార్థిని విద్యార్థులు కావలసిన విషయాలను తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఈ వీడ్కోలు సమావేశంలో అవుట వెంకటస్వామి , సీనియర్ ఉపాధ్యాయులు బచ్చన్న, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు బాలయ్య, మరియు ఉపాధ్యాయులు చంద్రశేఖర్, సత్యనారాయణ పుష్పలత, వీరోజి కృష్ణయ్య, ఇందిరా కుమారి, అఖిలేశ్వర్ రెడ్డి, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.