గోవిందాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

* "ఒక్కరోజు విద్యార్థులుఉపాధ్యాయులు అయినవేళ"

పయనించే సూర్యుడు మార్చి 12 రాజేష్ దౌల్తాబాద్) గోవిందాపూర్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒక రోజు పాటు ఉపాధ్యాయులుగా, పాఠశాల పరిపాలన బాధ్యతలు చేపట్టి తమ విధులను నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హెడ్‌మిస్ట్రెస్ మౌనిక, ఉపాధ్యాయులు మమత మరియు వందన పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల పరిపాలనలో వివిధ పదవులను చేపట్టి బాధ్యతలు నిర్వహించారు. డీఈవోగా సంజయ్, ఎంఈఓగా భాను ప్రసాద్, హెడ్‌మాస్టర్‌గా వరుణ్ తేజ, పీఈటీ మాస్టర్‌గా లోకేష్, పీఏగా సుమంత్ విధులు నిర్వర్తించారు. అలాగే ఉపాధ్యాయులుగా నిహారిక, భవన శ్రీ, భవ్య శ్రీ, అవంతిక, భావన, రితిక్ రోషన్ బాధ్యతలు చేపట్టారు. అటెండర్‌గా నందు గౌతమ్ సేవలందించారు. విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఉపాధ్యాయులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *