“పది” విద్యార్థులకు హాల్ టికెట్లు, పరీక్షా సామాగ్రి అందజేత

పయనించే సూర్యుడు మార్చ్ 12. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ : మండల పరిధిలోని కుర్తివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు, పరీక్షా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యతో సంపూర్ణమైన వికాసం సిద్ధిస్తుందని, విద్యార్థులు కష్టపడి చదివి, శతశాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అంతకుముందు పదో తరగతి విద్యార్థులకు పాఠశాల వీడ్కోలు పలికింది. సమావేశంలో విద్యార్థులు వారి వారి అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ శ్రీధర్ విచ్చేసి పదో తరగతిలో గరిష్ట మార్కులు పొందిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తానన్నారు. తాజా మాజీ సర్పంచ్ కొత్తూరి స్రవంతి శ్రీనివాస్, యువజన నాయకులు పుట్టి కిరణ్ కార్యక్రమానికి హాజరై పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లను అందజేశారు. ఉన్నతంగా ఎదిగి ఊరికి మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ సౌందర్య తోపాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *