ఘనంగా స్వర్గీయ బుద్దే రాజేశ్వర్ జయంతి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 12 బోధన్: సాలూర మండల కేంద్రంలో బుధవారం స్వర్గీయ బుద్దే రాజేశ్వర్ జయంతి ఘనంగా జరిపారు. పలువురు గ్రామ పెద్దలు ఆయన సతీమణి మాజీ ఎంపీపీ సావిత్రి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ తాను బ్రతికున్నంత కాలం నా గ్రామం నా ప్రజలు తన ఆరోగ్యం గురించి ఎల్లవేళలా లెక్కచేయకుండా పరితపించే నాయకుడు చివరికి ప్రజల కోసం తన ఆరోగ్యం పైన దృష్టి పెట్టకుండా అకాల మరణం పొందిన ముద్దుబిడ్డ అందరి ఆకలి తీర్చే స్వర్గీయ బుద్దె రాజేశ్వర్ అన్న అని అన్నారు. ఆయన లేని లోటు చిరస్మరణీయం అన్నారు. గ్రామంలో ఒక పెద్దాయన గా ఉండే ఆయన శాశ్వతంగా దూరం కావడంతో గ్రామ ప్రజలు బాధలు ఎవరికి చెప్పుకోవలెను అర్థం కావడం లేకపోయింది ఆపదలో ఉన్న వారికి ఆదుకునే వాడే కరైపోయిందని గ్రామస్తులు ఆయన జయంతిలో కన్నీరు మున్నీరు అయినారు. మండల గ్రామ పెద్దలు పలువురు నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *